నేను బానిస కాదు.. హరీష్ రావు బానిసలా ఉండొద్దు : ఈటెల

హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయం తర్వాత ఈటల రాజేందర్ ఓ మీడియా ఛానల్ కు సంచలన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. కెసిఆర్ తనను హరీష్ రావు ను పక్కన పెట్టాలని భావించారని ఈటెల వెల్లడించారు. కెసిఆర్ హరీష్ రావు కు ఎంత మామ అయినా… ఎంత రక్తసంబంధమైనా అతడు బానిసలా ఉండకూడదని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

Etela-Rajender
Etela-Rajender

తాను బానిసను కాదని పదవులు రావచ్చు పోవచ్చు అని ఏ పదవులు వచ్చినా ఎంత లాభం జరిగినా ఆత్మగౌరవాన్ని మించింది లేదని ఈటెల రాజేందర్ అన్నారు. పదవులు ఆస్తులు ఆత్మ గౌరవాన్ని పెంచాలని తగ్గించ కూడదు అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఆత్మ గౌరవం లేకుండా బ్రతుకుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఒక ఉద్యమకారుడు అయినటువంటి తనపై హరీష్ రావు అనేక అబద్ధాలు ప్రచారం చేశారని అన్నారు. ఎన్నికల తర్వాత హరీష్ రావు మీకు ఫోన్ చేశారా అని ప్రశ్నించగా ఒకసారి విడిచి పెట్టాక మళ్ళీ వాళ్ళ జోలికి పోనని ఈటెల వ్యాఖ్యానించారు.