కేంద్రం తీరు వల్లే 9.5 లక్షల ఆత్మహత్యలు- కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా..

కేంద్రం తీరు వల్లే దేశంలో ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల. దేశంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎన్డీయే అధికారం చేపట్టిన 7 ఏళ్లలో 9.5 లక్షల మంది బలవన్మరణాలుక పాల్పడ్డారని తెలిపారు. ప్రభుత్వంపై నిరాశ తోనే ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. 2014-21 వరకు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. ఇటీవల ఎన్సీఆర్బీ నివేదికను ఉటంకిస్తూ రణదీప్ సుర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆత్మహత్యల్లో 55 శాతం విద్యార్ధులు, నిరుద్యోగుల్లో 58 శాతం, రైతులు, కూలీల్లో 139.3 శాతం ఆత్మహత్యలు పెరిగాయని ఆయన తెలిపారు. మొత్తంగా గతంతో పోలిస్తే 19 శాతం అధికంగా ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయన్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల, ప్రభుత్వ చేత కాని తనం వల్ల రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సుర్జేవాలా విమర్శించారు. మోదీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2020 వరకు 69,407 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతు వ్యతిరేక విధానాల వల్ల 78,303 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 35,122 మంది వ్యవసాయ కూలీలు. ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.