ఈటెలకు ఒక్క వాహనం కూడా లేదట..?

హుజురాబాద్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఈటెల రాజేంద‌ర్ పేరిట ఒక్క వాహ‌నం కూడా లేద‌ట‌. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండ‌గా త‌న పేరు మీద స్కూట‌ర్ కానీ కారు కానీ లేవ‌ని ఈటెల త‌న అఫిడ‌విట్ లో పేర్కొన్నారు. అయితే 2014 ఎన్నిక‌లలో పోటీచేసిన స‌మ‌యంలో ఈటెల రాజేంద‌ర్ త‌న పేరు మీద మొత్తం మూడు చెత‌క్ స్కూట‌ర్ లు ఉన్న‌ట్టు పేర్కొన్నారు. ఈటెల‌కు చెత‌క్ స్కూట‌ర్ ఎంతో సెంటిమెంట్ అట‌..అందువ‌ల్లే ఆయ‌న ఏకంగా మూడు చెత‌క్ స్కూట‌ర్ ల‌ను సీరియ‌ల్ నంబ‌ర్ ల‌తో కొనుగోలు చేశార‌ట‌.

etela
etela

వాటి నంబ‌ర్ లు వ‌రుస‌గా ఏపీ28 ఏఏ 4818, ఏపీ 28 ఏఏ 4819, ఏపీ 28 ఏఏ 4820 గా ఉండ‌గా ఒకే సారి కొనుగోలు చేయ‌డం వ‌ల్ల వ‌రుస నంబ‌ర్ లో వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి ఎన్నిక‌ల్లో ఆ స్కూట‌ర్ లు క‌నిపించ‌క‌పోవ‌డం విషేశం. దాంతో ఆ స్కూట‌ర్ లు పాత‌వి అవ్వ‌డం వ‌ల్ల స్క్రాప్ కు వేశారా..లేదంటే త‌న అనుచ‌రులకు ఇచ్చారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రో వైపు మాజీ మంత్రి..బ‌డా వ్యాపార వేత్త అయిన ఈటెల పేరు మీద ఒక్క వాహనం లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం.