యూరపియన్ దేశాలను కరోనా అతలాకుతలం చేస్తోంది. దీనికి తోడు ఓమిక్రాన్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ దేశాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వాలు బూస్టర్ డోసుపై ఆలోచన చేస్తున్నాయి. దీంతో పాటు పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొన్ని దేశాలు 5 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభించింది. జర్మనీ, హంగరీ, గ్రీస్ మరియు స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాలు బుధవారం నుండి 05 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాయి.