బాలాపూర్, ఖైరతాబాద్ బడా గణేష్ లాంటి విగ్రహాల నిమజ్జనం చూసేందుకు లక్షల్లో భక్తులు వస్తుంటారు. విఘ్నేశ్వరుడు దర్శనానికి మహిళలు ఎక్కువగా వస్తున్నారు. దీంతో పోకిరీలు రెచ్చిపోతున్నారు. అసభ్యకరంగా, ఉద్దేశపూర్వకంగా తాకుతూ మహిళలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకే పోకిరిల భరతం పట్టేందుకు షీ టీమ్స్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనంలో 250 మందికి పైగా పోకిరీలపై కేసులు నమోదు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ లో మీడియాతో మాట్లాడిన ఆయన గతేడాదికంటే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకు నిమజ్జనం ఆలస్యం అయ్యిందన్నారు.జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 28న, 29న 10 వేల 20 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయన్నారు. నిమజ్జనం సందర్భంగా అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోకిరీలపై కేసు నమోదు చేశామన్నారు. చాలా చోట్ల న్యూసెన్స్ జరిగిన ప్రజలకు ఇబ్బంది కలగవద్దని పోలీసులు సమన్వయంతో డ్యూటీ చేశారని చెప్పారు. అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.