గాలిని ఫిల్టర్ చేసే మొక్కని ఎప్పుడైనా చూశారా..!?

-

మానవ మనుగడకు చెట్టు చాల అవసరం. కానీ నేటి సమాజంలో ఎక్కువగా చెట్లను నరికివేస్తున్నారు. అంతేకాక వాహనాల వాడకం ఎక్కువ కావడంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ కాలుష్యం నుండి ప్రజలను కాపాడటానికి హరిత హారం వంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక పర్యావరణంలోని గాలిలో కాలుష్యాన్ని నియంత్రించగల శక్తి చెట్లకు ఉంది. గాలిలో కార్భన్ డైయాక్సైడ్ ను చెట్లు పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును అందిస్తాయి. అలాగే ఆరెంజ్ కోటోనేస్టర్ అని పిలిచే ఓ కొత్త రకం మొక్క కూడా వాహనాల నుంచి వచ్చే పొగ ద్వారా ఏర్పడే గాలిలో కాలుష్యాన్ని వెంటనే పీల్చేచుకుంటోంది.

cotoneaster-plant

కోటోనేస్టర్ జాతుల్లో ఒకటైన పసుపు వర్ణం కాయలతో కనిపించే ఈ మొక్క గాలిని ఎప్పటికప్పుడూ ఫీల్టర్ చేసేస్తుందంట.. న్యూయార్క్ లోని రాయల్ హార్టికల్చరల్ సొసైటీ, యూకేలో యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ కు చెందిన పరిశోధక బృందం తమ అధ్యయనంలో గుర్తించింది. కారు నుండి వెలువడే కాలుష్య కారక వ్యర్థాలను పీల్చుకుని గాలిని శుభ్రంగా ఉంచడంలో సాయపడుతుందని కనుగొన్నారు. ఈ మొక్కను ఫ్రాంచెట్ లేదా ఆరెంజ్ కోటోనేస్టర్ గా పిలుస్తారు. వాయు కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది.

అయితే తక్కువ ట్రాఫిక్ ఉన్న వీధుల్లోని ఇతర హెడ్జ్ జాతుల మొక్కల మధ్య ప్రత్యేకమైన తేడాను గమనించలేదని పరిశోధకులు తెలిపారు. కాలుష్యానికి ప్రభావితమయ్యే ప్రాంతాల్లో కారకాలను తగ్గించడానికి ఈ మొక్క సాయపడుతుంది. ఈ మొక్కను అనేక సాగుల కోసం లేదా సౌందర్య విలువ కోసం విదేశాలకు తీసుకువెళ్లారు. అడవిలో పెరిగే ఈ మొక్క.. సాధారణంగా 3 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. చిన్నపాటి ఓవల్ ఆకులు మెరిసే ఆకుపచ్చ రంగుతో కనిపిస్తుది. టాప్ వైట్-ఫెల్టెడ్ అండర్ సైడ్. జూన్‌ నెలలో గులాబీ లేదా తెలుపు రేకులతో ఎరుపు-నారింజ బెర్రీలుగా పెరుగుతుంది. వీటిని సహజంగా గుర్తుపట్టడం చాలా కష్టమంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version