నువ్వు నాకు నచ్చావ్ సినిమాని 72సార్లు చూసిన యంగ్ హీరో..

-

సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో శ్రీ విష్ణు కూడా ఒకరు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన శ్రీ విష్ణు, ప్రస్తుతం తనకంటూ మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన గాలి సంపత్ సినిమాలో కనిపిస్తున్న శ్రీ విష్ణు, ఒకానొక ఇంటర్వ్యూలో తనకిష్టమైన హీరో ఎవరో చెప్పేసాడు.

ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఎక్కువ సార్లు థియేటర్లో చూసిన సినిమా ఏంటమ్ని అడిగితే, వెంటనే ఏమాత్రం తడుముకోకుండా నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పాడు. దానికి ఆలీగారు ఎన్ని సార్లు అనడిగారు. 72సార్లు థియేటర్లో చూసానని, తనకి బాగా ఇష్టమైన హీరో వెంకటేష్ అని చెప్పాడు. వెంకటేష్ గారి సినిమాల ద్వారా చాలా ప్రేరణ పొందుతానని, ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తానని అన్నాడు. గాలి సంపత్ సినిమా శివరాత్రి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version