రేస్ లో వెనకబడ్డ మహేష్ బాబు 2020 లో సినిమా లేనట్టే ..!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చి ఇప్పటికే 5 నెలలు కావస్తుంది. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు తర్వాత మళ్ళీ కొత్త సినిమా కబుర్లేవి రాలేదు. సూపర్ స్టార్ తో పాటు ఉన్న అల్లు అర్జున్ కూడా సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో వచ్చాడు. ఆ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరన్ లు ఇద్దరు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో ఆచార్య సినిమా తో బిజీనే.

 

Mahesh Babu Height, Age, Wife, Family, Caste, Biography & More

రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు క్రిష్ సినిమా కూడా ఒకేసారి వర్క్ జరుగుతుంది. ప్రభాస్ కూడా ఒక సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. ఇక నాని సినిమా ఒకటి రిలీజ్ కి రెడీగా ఉండగా ఒకటి సెట్స్ మీద ఉంది. నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా రిలీజ్ కి రెడీ. అలాగే రాం నటిస్తున్న రెడ్ కూడా రిలీజ్ కి రెడీ గా ఉంది. నితిన్ కూడా రంగ్ దే సినిమాతో బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ఇలా టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ వరకు అందరు తమ సినిమాల షూటింగ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, చిరంజీవి కొరటాల ఆచార్య తప్ప మిగిలిన హీరోలందరి సినిమాలు 2020 లో రిలీజ్ కి సిద్దం చేసి పెట్టుకున్నారు. కాని ఒక్క మహేష్ బాబు మాత్రం కనీసం తను నటించబోతున్న సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటి లేదు. అనుకున్న రెండు ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయి. పరశురాం సినిమా కూడా పట్టాలెక్కేసరికే ఇంకా 3 నెలలన్నా సమయం పడుతుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే 2020 లో మహేష్ బాబు సినిమా ఉండదని క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఎందుకు ఇంత వెనకబడి ఉన్నాడో సూపర్ స్టార్.

Read more RELATED
Recommended to you

Latest news