ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉంది : హైడ్రా కమిషనర్

-

ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉందని  హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం, రైట్ టూ లైఫ్ ఉద్దేశం అన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులే అన్నారు. హైడ్రా పై సోషల్ మీడయాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.

అమీన్ పూర్ లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. అమీన్ పూర్ లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారని రంగనాథ్ తెలిపారు. భవనంలో ఆసుపత్రి లేకపోయినా ఆసుపత్రి ఉన్నట్టు ప్రచారం చేశారని పేర్కొన్నారు. కొందరూ బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారన్నారు. అనధికార ఆస్తులను కూల్చివేశామన్న ఆయన.. ఇప్పటివరకు 21, 22 ప్రాంతాల్లో కూల్చివేతలు చేసామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news