రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించినా కనికరం చూపడం లేదు : జగన్

-

చంద్రబాబు ఇంటికి, మిర్చి మార్కెట్ యార్డు ఎంత దూరంలో ఉంది.. గుంటూరు జిల్లా లో ఉండే సీఎంకి మిర్చి రైతుల భాద పట్టదా.. రైతుల కష్టాలు చంద్రబాబుకు కనిపించినా కనికరం చూపడం లేదు అని మాజీ సీఎం జగన్ అన్నారు. మా ప్రభుత్వ లో క్వింటా 21 వేల నుండి 23 వేల రూపాయల ధర పలికింది. ప్రస్తుతం పది పదకొండు వేలకు మించి మిర్చి కొనటం లేదు. పెట్టుబడి ఖర్చులు 1.50 నుండి రెండు లక్షల రూపాయలకు పెరిగాయి. మిర్చి దిగుబడి ఎకరానికి ఇరవై క్వింటాళ్ల నుండి పదిహేను క్వింటాళ్లకు పడిపోయింది. తెగుళ్ళ బారిన పడి దిగుబడులు తగ్గాయి. పండిన పంటను అమ్ములేక రైతు జీవితం దుర్భరంగా మారింది.

రైతుల జీవితాల్లో వెలుగులు నింపటానికి మా ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆర్బికెలు, ఈ క్రాప్ లు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ లు కనిపించటం లేదు. గతంలో ఆర్బికేలు రైతుల చేయి పట్టి నడిపించేవి. మా ప్రభుత్వ హాయాంలో ఏడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతుల పంటలు కొనుగోలు చేశాం. పీఎం కిసాన్ యోజన కాకుండా కూటమీ ఇస్తానన్న ఇరవై వేలు రూపాయల సాయం ఇవ్వాలి. ఎల్ల కాలం టిడిపి ఆటలు సాగవు.. రైతులు గోడు పట్టించుకోక పోతే రైతుల పక్షాన పోరాటం చేస్తాం అని జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version