హలో మాజీ క్రికెటర్స్… సెమీఫైనల్ జట్లపై మీ అభిప్రాయాలు మార్చుకోండి !

-

వరల్డ్ కప్ స్టార్ట్ అవడానికి ముందు ప్రపంచంలో ఉన్న మాజీ క్రికెటర్లు స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా సెమి ఫైనల్ కు అర్హత సాధించే జట్లు ఏవి అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక్కొక్కరు నాలుగు జట్ల పేర్లను చెప్పిన విషయం తెలిసిందే. ఈ జట్లలో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా లు ఉన్నాయి. అయితే ఎక్కువ మంది చెప్పిన జట్లలో మొదటి మూడు స్థానాలలో ఇండియా, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ లు ఉన్నాయి.. కేవలం నాలుగవ స్థానం కోసం మాత్రం పాకిస్తాన్, న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన పోటీ ఉంది. కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ లు అంచనాలకు తగినట్లే రాణిస్తుండగా, ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ లు మాత్రం తగిన విధంగా ప్రదర్శన ఇవ్వడంలో తేలిపోతున్నాయి.

ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లు ఓడిపోయింది, ఇక ఇంగ్లాండ్ చూస్తే ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు ఓడిపోయింది.. ఈ ఫలితాలను చూసిన నెటిజన్లు మాజీ క్రికెటర్లు మీ అభిప్రాయాలను మార్చుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంకా మ్యాచ్ ఉన్నందున మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలు లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news