తుపాకీ తీసి హల్చల్ చేసిన మాజీ మంత్రి !

-

చిట్యాల మండలం ఉరుమడ్ల లో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి చానళ్ళ తరువాత వార్తల్లోకి ఎక్కారు. అది కూడా ఒక సంచలన అంశంలో. పిల్లయి పల్లి కాలువ విస్తరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ని మాజీ మంత్రి తుపాకీతో బెదిరించారు. తన పొలం నుంచి కాలువను తీయవద్దని ఆయన బెదిరించినట్లు తెలుస్తోంది. దీని మీద చిట్యాల పీఎస్ లో కేసు నమోదయింది.

విచారణ చేసిన పోలీసులు మాజీమంత్రి గుత్తా మోహన్ రెడ్డి ని అరెస్ట్ చేసి తుపాకీ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి పొలం మధ్యలో నుండి కాల్వ పోతుంది. అందుకని దానిని తన పొలంలో నుండి కాకుండా సైడు నుండి తీయాలని గుత్తా మోహన్ రెడ్డి చెప్పారు కానీ ఇంజనీర్లు ఆయన మాట వినకుండా తమ ప్లాన్ లో ఉన్నట్టుగానే అక్కడ నుండి కెనాల్ తీస్తుండడంతో మాజీ మంత్రి తన వద్దనున్న లైసెన్సడ్ గన్ తో జేసీబీ డ్రైవర్,సైట్ ఇంజినీర్ ను బెదిరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news