కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (30-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశంలో కొత్తగా 78,761 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,42,734కు చేరుకుంది. 7,65,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 27,13,934 మంది చికిత్స పొందుతున్నారు. 63,498 మంది చనిపోయారు.
2. ఏపీలో కొత్తగా 10,603 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,24,767కు చేరుకుంది. 3,884 మంది చనిపోయారు. 3,21,754 మంది కోలుకున్నారు. 99,129 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
3. బ్రెజిల్‌లో కరోనా మరణాల సంఖ్య 1.20 లక్షలకు చేరుకుంది. 38,46,153 మొత్తం కేసులు ఉన్నాయి. కొత్తగా 41,350 కేసులు నమోదయ్యాయి. 30,06,812 మంది కోలుకున్నారు.
4. తెలంగాణలో కొత్తగా 2,924 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,23,090కి చేరుకుంది. 90,988 మంది కోలుకున్నారు. 24,716 మంది చికిత్స పొందుతున్నారు. 818 మంది చనిపోయారు.
5. కర్ణాటకలో కొత్తగా 8,852 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,35,928కు చేరుకుంది. 2,42,229 మంది కోలుకున్నారు. 88,091 మంది చికిత్స పొందుతున్నారు. 5,598 మంది చనిపోయారు.
6. తమిళనాడులో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి తెలిపారు. ఆదివారాల్లో లాక్ డౌన్ ఉండదని తెలిపారు. ప్రార్థనా మందిరాలు, హోటల్స్, రిసార్టులకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.
7. తమిళనాడులో కొత్తగా 6,495 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,22,085కు చేరుకుంది. 7,231 మంది చనిపోయారు. 3,62,133 మంది కోలుకున్నారు. 52,721 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
8. తెలంగాణలో సోమవారం నుంచి వరుసగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో పరీక్షలను నిర్వహించనుంది. సోమవారం ఈసెట్ పరీక్ష జరగనుంది.
9. కరోనా వైరస్ రెండోసారి వ్యాప్తి చెందితే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందదని సైంటిస్టులు తేల్చారు. రెండోసారి పాజిటివ్ గా నిర్దారణ అయిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించవన్నారు.
10. సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాక్సీ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ వర్కర్లు, హాకర్లకు ఉచితంగా కరోనా పరీక్షలు చేయనున్నారు. వీరు నిత్యం బయట ఎక్కువగా తిరుగుతారు కనుక కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించారు.