ఏపీలో పాజిటివ్ కేసుల నమోదు ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకు అరవై వేల టెస్ట్ లు చేస్తుండడంతో ప్రతి రోజూ అదే రేంజ్ లో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. నిన్నటికి నిన్న ఏపీలోని ఒక ఎమ్మెల్యే, మరో ఎంపీ కరోనా బారిన పడగా ఈరోజు మరో మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఆయనకు కొన్ని లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయన కరోనా బారిన పడ్డట్టు తేలింది.
అయితే పెద్దగా లక్షణాలు ఏవీ కనిపించక పోవడంతో అయన హోమ్ క్వారంటైన్ లో ఉండనున్నారు. అలానే గత కొద్ది రోజులుగా తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు అందరినీ టెస్ట్ చేయిన్చుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఇక అనంతపురం జిల్లాలో కరోనా ఉధృతి భారీగా ఉంది. ఇప్పటిదాకా కరోన వచ్చిన వారి సంఖ్య ఏకంగా 40 వేలు దాటేసింది. నిన్న ప్రకటించిన బులెటిన్‌లో 24 గంటల వ్యవధిలో 695 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40155కి చేరింది.