కారు కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్..!

-

కారు కొనుగోలు చేయాలని అనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. లోన్ ద్వారా కారును తీసుకోవాలనుకుంటే తొలి 6 నెలలు ఈఎంఐ కట్టనక్కర్లేదని ప్రముఖ కార్ల తయారీ సంస్థ తెలిపింది.లోన్ ద్వారా కారు కొనాలని యోచిస్తున్నారా.. అయితే మీకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో వచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా తమ వినియోగదారులకు తీపి కబురు తెలిపింది. కోవిడ్-19 నేపథ్యంలో చాలా మంది ప్రజలు స్వంత వాహనాలకే మొగ్గు చూపడంతో ఈ స్కీంను అందుబాటులో తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.

 car
car

ఫోర్డ్ ఇండియా తాజాగా ఓ ప్రకటన వెల్లడించింది. తన కంపెనీ కార్లను అమ్మేందుకు కస్టమర్లను ఆకర్షించడానికి ఈఎంఐతో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి తొలి 6 నెలలు ఈఎంఐ కట్టనక్కర్లేదని వెల్లడించింది. ఈఎంఐ ఏడో నెల నుంచి ప్రారంభం అవుతుందన్నారు. ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ సహా పలు కార్ల కొనుగోలుకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రజలు బస్సుల్లో, ఆటోల్లో, క్యాబ్ లలో ప్రయాణించడానికి భయపడుతున్నారు. సొంత వాహనానికే మొగ్గు చూపడంతో చాలా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడానికి రకరకాల స్కీంలను అందుబాటులో తీసుకొచ్చాయి. తక్కువ ధరకు అమ్మడం లేదా ఈఎంసీ స్కీం ద్వారా కొన్ని నెలల వరకు ఈఎంఐ చెల్లింపును సదుపాయం కల్పిస్తున్నారు.

జూలై 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని రుణంపై 8.99 శాతం వడ్డీ భారం పడుతుంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ కు మాత్రమే ఈ వడ్డీ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. మిగిలిన కార్లైన ఫోర్డ్ యాస్పైర్, ఫిగో లేదా ఫ్రీస్టైల్ వంటి మోడల్ వాహనాలను కొనుగోలు చేయడానికి వడ్డీ రేటు 9.5 శాతంగా నిర్ణయించామన్నారు.

కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కోసం మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. స్టెప్ అప్ ప్లాన్ ద్వారా వినియోగదారులు తక్కువ ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ క్రమంగా పెరుగుతుందని తెలిపారు. ఎకోస్పోర్ట్స్ కారు ఈఎంఐ ధర రూ.17.27 లక్షలని, ఐదేళ్లలోపూ కారు రుణాన్ని చెల్లించాలని సంస్థ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news