మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత

-

హిమ్లా: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ మాజీ సీఎం వీర‌భ‌ద్ర‌సింగ్‌(87) క‌న్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యం కార‌ణంగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. వీర‌భ‌ద్ర‌సింగ్‌కు కొంత‌కాలంగా ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.. ఏప్రిల్ 13న ఆయ‌న కొవిడ్‌-19కు గుర‌య్యార‌ని, అప్పుడు చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారని చెప్పారు. కానీ మళ్లీ రెండోసారి కూడా ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు.

కాగా 1934 జూన్ 23న సిమ్లాలో జ‌న్మించిన‌ వీర‌భ‌ద్ర‌సింగ్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. అంతేకాదు ఆరుసార్లు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా ప‌నిచేశారు. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య కూడా రాజకీయాల్లో ఉన్నారు. ప్రతిభా సింగ్ మాజీ ఎంపీ కాగా.. ఆయన కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరభద్రసింగ్ కన్నుమూతతో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version