సౌదీ అరేబియాలో నివసిస్తున్న ప్రవాసులకు అక్కడి ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. రీ-ఎంట్రీ వీసాలపై తమ దేశానికి వెళ్లి, కరోనా మహమ్మారి నేపథ్యంలో నిర్ణీత సమయానికి తిరిగి రాలేకపోయిన ప్రవాసులు ఇప్పుడు సౌదీకి తిరిగి రావడానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 15 ఉదయం 6 గంటల నుంచి ప్రవాసులు తిరిగి సౌదీకి రావచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే, ఈ ఆర్డర్‌తో గడువు ముగిసిన రీ-ఎంట్రీ వీసా, జాబ్ వీసా, విజిటింగ్ వీసాలు ఉన్నవారు తిరిగి సౌదీకి వెళ్లే అవకాశం ఏర్పడింది. ఏదేమైనా, దేశంలోకి ప్రవేశించే ఎవరైనా సరే 48 గంటల ముందు జారీ చేసిన కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిందేనని సంబంధిత అధికారులు పేర్కొనడం గమనార్హం.