మూడు దేశాల వేరియంట్ లను చంపేస్తున్న మన తెలుగు వ్యాక్సిన్…!

భారతీయ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ బ్రెజిల్ వేరియంట్ అయిన SARS-CoV-2, B.1.128.2 కు వ్యతిరేకంగా సమర్థవంతమైన ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన కొత్త అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

బ్రెజిలియన్ వేరియంట్లో అమెరికాలోని న్యూయార్క్‌లో కనుగొన్న E484K మ్యుటేషన్ ఉంది. గతంలో నిర్వహించిన అధ్యయనంలో ఈ వాక్సిన్ బ్రిటీష్ వేరియంట్ ని కూడా చంపేస్తుంది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని అధ్యయనాలలో కోవాక్సిన్ బలమైన ఫలితాలను చూపుతోంది అంటూ అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. అమెరికా అంటూ వ్యాధి నిపుణుడు ఫౌజీ కూడా చెప్పారు.