కరీంనగర్ శ్వేత హోటల్లో ఎక్స్పైర్ అయిన ఫుడ్ ఐటెమ్స్

-

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులు హోటల్స్, రెస్టారెంట్ యాజమాన్యంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. చాలా వరకు హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోవడం, గడువు తీరిన ఆహార పదార్థాలు విక్రయించడం వంటివి గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే కేవలం స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలోనే కాదు బడా బడా రెస్టారెంట్లలోనూ ఇలాంటి సంఘటనలు గుర్తించడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది.

ఇక తాజాగా కరీంనగర్లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కరీంనగర్‌లోని శ్వేత హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో అధికారులు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. అలాగే వంటల్లో గడువు తీరిన పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ తనిఖీలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news