వాలంటీర్ల వ్యవస్థ పై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

-

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్లను కొనసాగిస్తారా? లేదా తొలగిస్తారా? అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ ఎన్నికలకు ముందు వలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ కేబినెట్ సమావేశంలో వలంటీర్ వ్యవస్థ పై కేబినెట్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. దీంతో ఏపీలో వలంటీర్లను పక్కన పెట్టేస్తునట్టేనా అని కొందరు ప్రశ్నించారు.

తాజాగా దీనిపై మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వలంటీర్ ఈ వ్యవస్థను తాము రద్దు చేయలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులతో జూలై 1వ తేదీన ఇంటింటికీ నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు సచివాలయాలు, వలంటీర్ల శాఖ మంత్రిగా ఆయన సచివాలయం 3వ బ్లాక్లో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అటు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వలంటీర్ల కొనసాగింపు పై సందేహాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news