ఎయిర్‌పోర్టుకు ఎక్స్ ప్రెస్ మెట్రోపై NVS రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెట్రో పనులు వేగవంతం చేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణంపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే పలు మార్లు ఈ మార్గాన్ని పరిశీలించిన అధికారులు మరోసారి రూట్‌మ్యాప్‌ పరిశీలన చేపట్టారు.

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి రైల్వే బోర్డు సభ్యులు, సంబంధితశాఖల ఉన్నతాధికారులు ఇవాళ ప్రత్యక్షంగా రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాయదుర్గం స్టేషన్‌ నుంచి నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ వరకు మెట్రో నిర్మాణం చాలా క్లిష్టతరమైంది. 21 మీటర్ల ఎత్తులో మైండోస్పేస్‌ జంక్షన్‌ దాటడం సవాలుతో కూడుకుంది. అండర్‌పాస్‌, మధ్యలో రోటరీ క్లబ్‌, ఫ్లైఓవర్ ఉన్నాయి. ఈ మూడు అడ్డంకులను దాటేందుకు ప్రత్యేక స్పాన్‌ను అక్కడికక్కడే నిర్మించే విధంగా పరిశీలిస్తున్నాం. ఎయిర్‌పోర్టు మెట్రో పిల్లర్లను ఫ్లైఓవర్‌ పిల్లర్లకు దూరంగా నిర్మించాల్సి ఉంది. అత్యుత్తమ ఇంజినీరింగ్‌ పరిష్కారాల కోసం అధ్యయనం చేస్తున్నాం. ఇక్కడి సాంకేతిక సవాళ్లను ఎదుర్కొని పరిష్కార మార్గాలను సూచించేందుకు ఈ మార్గంలో తనిఖీలు చేశాం’’ అని ఎన్వీఎస్‌రెడ్డి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news