అరే.. ముక్కు మీద కళ్ల అద్దాల మచ్చలు పోవడం లేదా.. అయితే.. ఇలా చేసేయండి..!

-

సిస్టిమ్ వర్క్ చేసేవాళ్లు, సైట్, తలనొప్పి ఉన్నవాళ్లు..డైలీ కళ్లద్దాలు పెట్టుకుంటారు. వీటి ద్వారా కంటికి మేలు జరుగుతుంది కానీ.. ఫేస్ మీద కాస్త నెగిటివ్ ఎపెక్ట్ పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. కళ్లకింద నల్లగా తయారవుతుంది. ముక్కు మీద మచ్చలు వస్తాయి. ఇక కంటికింద నల్లటి వలయాల గురించి మనందరికి బాగా తెలుసు.. ఏం చేస్తే పోతుందో ఇప్పటికే చాలా సార్లు చెప్పుకున్నాం. మరి ముక్కు మీద పడే మచ్చలను తొలగించడం ఎలా..? అటు ఇటూ..తెల్లగా మచ్చలు వచ్చేస్తాయి కదా.. ఈరోజు వీటిని ఎలా క్లియర్ చేసుకోవచ్చో చూసేద్దాం.!

కూరల్లో వాడే.. కీరా దోసకాయ, మరకలను తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు.ముక్కలుగా కట్ చేసి ముక్కుపై అప్లై చేయండి. ఇలా కొన్ని రోజులు చేస్తే ముక్కుపై ఉన్న నల్లటి మరక పోతుంది.

బాదం విటమిన్ E ఉంటుంది. ఇది చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. రోజూ 2-3 బాదంపప్పులను నానపెట్టి.. పేస్ట్ చేయండి. దాన్ని మచ్చ ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. కాసేపటి తర్వాత తర్వాత కడిగేయాలి. దీంతో ముక్కుపై ఉన్న మరక తొలగిపోతుంది.

అలోవెరా గుజ్జును తీసివేసి మెత్తగా పేస్ట్ చేయండి. అప్పుడు దానిని మరక ఉన్న భాగానికి అప్లై చేయండి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. అయితే కొందరికి అలోవెరా అంతగా సెట్ కాదు. అలాంటివారు ఈ టిప్ ను స్కిప్ చేయండి. లేదా ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసి సెట్ అయితే అప్పుడు వాడుకోవచ్చు.

ముక్కుపై ఏర్పడిన కంటి అద్దాల మరకలపై నిమ్మరసాన్ని అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు నీటితో శుభ్రం చెయాలి. నిమ్మరసంతో బ్లీచింగ్ చేయడం వల్ల మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.

టమోటా ఫేస్ కు నెంబర్ వన్ గా పనిచేస్తుంది. ఇది ఒక్క ముక్కు మీద మచ్చలనేంటి.. ఫేస్ మీద ఏర్పడిన ఎలాంటి మచ్చలనైనా తొలగిస్తుంది. కట్ చేసి మచ్చలపై రుద్దడం వల్ల మరక తొలగిపోతుంది. టామాట ఫేస్ మీద ట్యాన్ పోగొట్టుడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. వీలునప్పుడల్లా.. బాగా పండిన టమాటా తీసుకుని.. ఫేస్ కు అప్లై చేసి..లైట్ గా మర్థన చేసుకుని.. ఒక అరగంట పాటు ఉంచి ఆ తర్వాత క్లీన్ చేస్తూ ఉండండి. మరుసటి రోజు ముఖం గ్లోయింగ్ తో సూపర్ లుక్ వస్తుంది .!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news