Official : ఎఫ్3 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న ఎఫ్3 సినిమా విడుద‌లకు సిద్ధం అయింది. ఇటీవ‌ల సినిమా చిత్రికర‌ణ పూర్తి చేస్తున్న ఎఫ్ 3.. విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించారు. మే 27వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాను థీయేట‌ర్ ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర బృందం అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. కాగ 2019 లో వ‌చ్చిన ఎఫ్ 2 సినిమా.. సినిమా బాక్సాఫీస్ ను బ‌ద్ద‌లు కొట్టింది. కేవ‌లం రూ. 30 కోట్ల‌తో తెర‌కెక్కిన ఎఫ్ 2.. ఏకంగా రూ. 128 కోట్ల‌ను వ‌సూల్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది.

ఎఫ్ 2 సూప‌ర్ హిట్ కావ‌డంతో డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.. సీక్వెల్ గా ఎఫ్3 తెర‌కెక్కించాడు. ఎఫ్ 2 లో ప్ర‌ధాన పాత్ర‌లుగా ఉన్న వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ్రీన్ ఫిర్జాదా.. ఎఫ్ 3 లోనూ అవే పాత్ర‌లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా జ‌న‌వ‌రి లోనే విడుదల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ క‌రోనా మహ‌మ్మారి వ‌ల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వ‌చ్చింది. ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎట్ట‌కేల‌కు చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాను మే 27న ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news