IPL : పంజాబ్, హైద‌రాబాద్ మ్యాచ్ లో డీఆర్ఎస్ వివాదం

-

ఐపీఎల్ నేడు స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో డీఆర్ఎస్ వివాదం నెల‌కొంది. పంజాబ్ బ్యాటింగ్ లో ఉన్న స‌మ‌యంలో ఈ వివాదం తలెత్తింది. ఈ మ్యాచ్ లో భాగంగా న‌టరాజ‌న్ ఐదో ఓవ‌ర్ వేస్తున్న స‌మ‌యంలో.. క్రిజ్ లో పంజాబ్ బ్యాట్స్ మెన్ ప్ర‌భ్ సిమ్రాన్ ఉన్నాడు. అయితే ఈ ఓవ‌ర్ లో ఐదో బంతి బ్యాడ్ కు త‌గిలి.. కీప‌ర్ పూర‌న్ క్యాచ్ తీసుకున్నాడు. దీంతో కెప్టెన్ కేన్ విలియమ్స‌న్ రీవ్యూ తీసుకున్నాడు.

అంప‌ర్ రీవ్యూకు అనుమ‌తి ఇచ్చాడు. దీంతో పంజాబ్ బ్యాట్స్ మెన్.. బెయిర్ స్టో.. అంప‌ర్ తో వివాదానికి దిగాడు. ఎస్ఆర్ఎచ్ కెప్టెన్ కేన్.. రీవ్యూ టైం 15 సెక‌న్ల త‌ర్వాత.. రీవ్యూ తీసుకున్నాడ‌ని బెయిర్ స్టో వాదించాడు. రీవ్యూ కు అవ‌కాశం ఎలా ఇచ్చారంటూ.. అంప‌ర్ ను ప్ర‌శ్నించాడు. కాగ కేన్ విలియమ్స‌న్.. చివ‌రి క్షణంలో రీవ్యూకు అప్పిల్ చేశాడ‌ని అంప‌ర్ స‌ర్చి చెప్పాడు. కాగ ఈ రీవ్యూలో ఎల్బీడబ్యూ అవుట్ అని అప్పిల్ చేయ‌గా.. ప్ర‌భ్ సిమ్రాన్ .. క్యాచ్ అవుట్ ద్వారా అవుట్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news