F3Movie : ఎఫ్‌-3 మూవీ ట్రైలర్‌ కు ముహుర్తం ఖరారు

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు.

ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సినిమా లో… కూడా హీరోయిన్లుగా తమన్నా మరియు మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయి….విడుదలకు రెడీగా ఉంది.

అయితే.. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ సినిమా ట్రైలర్‌ మే 9 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటిచింది. కాగా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 27వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news