కేటీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్… టీఆర్ఎస్ వైఫల్యాలపై ట్వీట్

-

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. ఈ రోజు ( సోమవారం) కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత అంటూ.. అన్ని సమస్యలకు మూలం పీఎం మోడీకి విజన్ కొరత అంటూ ట్వీట్ చేశారు. ఇది ఎన్పీఏ గవర్నమెంట్ ఫెర్ఫామెన్స్ అంటూ విమర్శించారు. 

దీనికి కౌంటర్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ పాలనలో “ఇంటికో ఉద్యోగం లేదు” “నిరుద్యోగ భృతి లేదు” “ఉచిత ఎరువులు లేదు” “ఋణమాఫీ లేదు” “దళిత ముఖ్యమంత్రి లేదు” “దళితులకు మూడెకరాల భూమి లేదు” “పంటనష్ట పరిహారం లేదు” “దళితబందు లేదు” “బిసిబందు అసలే లేదు” “ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేదు” “డబుల్ బెడ్ రూమ్ జాడ లేదు” “అప్పులకు కొదవ లేదు” “కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు” “కొత్త పెన్షన్ కార్డుల జాడ లేదు” “సామాజిక న్యాయం లేదు” “సచివాలయం లేదు” “సీఎం ప్రజలను కలిసేది లేదు” “ఉద్యమ కారులకు గౌరవం లేదు” “విమోచన దినోత్సవం జరిపేది లేదు” . . . . . ఇలా చెప్పుకుంటూ పోతే “కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news