వేషం మార్చినా చిక్కాల్సిందే..!

-

దేశ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ( డీఆర్‌డీఓ) నిరంతరం తమ పరిశోధనాలు కొనసాగిస్తూనే దేశాన్ని శత్రువుల బరి నుంచి కాపాడేందుకు కొత్తకొత్త ఆయుధ పరిజ్ఞానంపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు కృతిమ మేధతో ముఖగుర్తింపు సాంకేతికపై పని చేస్తున్నారని డీఆర్‌డీఓ ఛైర్మన్‌ డా. సతీష్‌ రెడ్డి పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం ఇది చాలా అవసరమని శత్రువులు తమ వేశాలు మార్చినా ఫేస్‌ రికగ్నేషన్‌ సాంకేతికత గుర్తిస్తోందన్నారు. దేశంలో చొరబడి వివిధ భాషాల్లో వారు మాట్లాడుతుండగా ఆ భాషాలన్నీ తర్జుమా అయ్యేలా ‘లాంగేజ్‌ ఆటోమేషన్‌’ పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.

డ్రోన్‌ టెక్నాలజీపై..

ఈ ఏడాదిలో భాగ్యనగరంతో పాటు వివిధ నగరాల్లో ఏర్నాటు చేసిన యంగ్‌సైంటిస్ట్‌ ట్యాబ్‌లలో ముందు తరాల సాంకేతికతపై యువ శాస్త్రవేత్తలు కసరత్తులు చేస్తున్నారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. హ్యకింగ్‌కి అవకాశం లేకుండ క్వాంటమ్‌కీ డిస్ట్రిబ్యూషన్‌ టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లనే ఆయుధాలుగా మార్చే డ్రోన్‌ టెక్నాలజీపై కూడా పరిశోధనలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news