ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఫేషీయల్ రికగ్నేషన్ యాప్ అటెండెన్సును హెచ్వోడీలకు వర్తింప చేస్తూ ఉత్తర్వులిచ్చింది జగన్ ప్రభుత్వం. హెచ్వోడీ కార్యాలయం, సెక్రటేరీయేట్, సీఎంఓల నుంచి ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసే వెసులుబాటును హెచ్వోడీలకు కల్పించింది ప్రభుత్వం.
ఆయా శాఖల కార్యదర్శులు ఫేషీయల్ రికగ్నేషన్ యాప్ అటెండెన్సును రెగ్యులర్‌గా మానిటర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సెక్రటేరీయేట్‌లోని ఉన్నతాధికారులకు ఫేషీయల్ రికగ్నేషన్ యాప్ అటెండెన్సును అమలు చేస్తోంది సర్కార్. ఇక నవంబర్ 1 నుంచి హెచ్వోడీలకు ఫేషీయల్ రికగ్నేషన్ యాప్ అటెండెన్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగానే, ఈ నెల 25-31వ తేదీల్లో యాప్‌ను ట్రైల్ రన్ నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.