ఫేస్‌యాప్ డౌన్‌లోడ్స్ సంఖ్య ఇప్పటికే 10వేల కోట్లు దాటింది. ప్రస్తుతం ఈ యాప్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తోంది.
ప్రస్తుత తరుణంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఎన్నో సోషల్ మీడియా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిల్లో అనతికాలంలోనే అధిక సంఖ్యలో యూజర్లను సొంతం చేసుకున్న యాప్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిల్లో ఫేస్‌యాప్ కూడా ఒకటి. యూజర్లు తమ ఫొటోలను ఆ యాప్‌లోకి అప్‌లోడ్ చేస్తే.. అందులో ఆ ఫొటో ప్రాసెస్ అవుతుంది. ఆ తరువాత దానికి ఓల్డ్ ఏజ్ ఫిల్టర్‌ను అప్లయి చేసుకోవచ్చు. దీంతో మనం వృద్ధాప్యంలో ఎలా ఉంటామో ఆ యాప్ మన ఫొటోను మార్ఫింగ్ చేసి చూపిస్తుంది.
అయితే ఫేస్‌యాప్ ఇలా ఫొటోలను మార్ఫింగ్ చేసి అచ్చం మనం వృద్ధాప్యంలో ఎలా ఉంటామో.. కచ్చితంగా అలాగే చూపిస్తుండడంతో పెద్ద ఎత్తున యూజర్లు ఈ యాప్‌ను తమ తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ యాప్ డౌన్‌లోడ్స్ సంఖ్య 10వేల కోట్లు దాటింది. ఇక ప్రస్తుతం ఈ యాప్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తోంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ యాప్ ఇప్పుడు ఎంతగా పాపులర్ అయిందో..!
ఫేస్‌యాప్ యాప్‌లో కేవలం ఓల్డ్ ఏజ్ ఫిల్టర్ మాత్రమే కాక.. పలు ఇతర ఫిల్టర్లు కూడా లభిస్తున్నాయి. యంగ్, బియర్డ్, గ్లాసెస్.. తదితర ఫిల్టర్లను ఉపయోగిస్తూ యూజర్లు ఆయా వేషాల్లో ఎలా ఉంటారో చూసుకోవచ్చు. అయితే కొన్ని ఇతర ఫిల్టర్లను పెయిడ్ వెర్షన్‌లో అందిస్తున్నారు. ఏది ఏమైనా.. ఫేస్ యాప్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అయింది. అయితే ఈ యాప్‌లో ప్రస్తుతం సర్వర్ సమస్యలు వస్తున్న దృష్ట్యా.. అతి త్వరలోనే ఆ సమస్యలను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..!