ఫేస్ బుక్ కు “మెటా” గా పేరు పెట్టిన జుకర్ బర్గ్..!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మాతృ సంస్థ పేరు మారింది. ఫేస్ బుక్ మాతృసంస్థ కు మెటా గా దాని అధినేత మార్క్ జుకర్ బర్గ్ నామకరణం చేశారు. అంతేకాకుండా జుకర్ బర్గ్ ఫేస్ బుక్ కొత్త లోగో ను ప్రకటించారు. గురువారం కంపెనీ కనెక్ట్ ఈవెంట్ లో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అయితే కేవలం ఫేస్ బుక్ మాతృ సంస్థ పేరు మాత్రమే మారగా దాని కింద ఉండే సామాజిక మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ ల పేర్లు మరియు లోగోలు అదే విధంగా ఉంటాయని తెలుస్తోంది.

Facebook new name meta

ఇక ఈ సందర్భంగా జుకర్బర్గ్ మాట్లాడుతూ…” మెటా వర్స్” లో భాగంగా పేరు మార్పు జరిగిందని చెప్పారు. యాప్ లో నుండి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన మెటా వర్స్ దిశగా అడుగులు వేస్తుందని జూకర్బర్గ్ స్పష్టం చేశారు. ఒకరినొకరీని కలిపి ఉంచే కంపెనీ మనది అంటూ వ్యాఖ్యానించారు. సాంకేతికతతో ప్రజలను అందరిని ఒక వద్ద కేంద్రీకరించ వచ్చని దాంతో ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత బ్రాండ్ ఇకపై మనకు భవిష్యత్తులో సేవలందించిన పోవచ్చునని అందుకే బ్రాండ్ కు కొత్త పేరు పెట్టమని అన్నారు.