కంటి ఆరోగ్యం మొదలు క్యాన్సర్ వరకు ద్రాక్షతో తరిమేయండి…!

-

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమమైన పండ్లలో ద్రాక్ష పళ్ళు ఒకటి. ద్రాక్ష పళ్లని వైన్ తయారీలో ఉపయోగిస్తారని అందరికి తెలుసు. అది కాకుండా ద్రాక్ష పళ్ళు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, జుట్టు బలపడడానికి కూడా ఉపయోగపడుతుంది.

 

grapes

ద్రాక్ష పళ్ళు రెండు కేటగిరీలుగా ఉంటాయి ఒకటి ఆకుపచ్చ మరియు ఇంకొకటి ఎరుపు రంగు. ఈ రెండు కూడా మనిషి ఆరోగ్యానికి అవసరమే. ద్రాక్ష పండ్లు లో అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటితో పాటు ఫైటో న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అవే కెరోటినాయిడ్స్ మరియు పోలీఫెనోల్. వీటన్నిటితో పాటు పొటాషియం, విటమిన్ సి విటమిన్ కె కలిగి ఉంటాయి. ద్రాక్ష పళ్ళని మనం తినడం వల్ల బ్యాక్టీరియల్, వైరస్ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుకోవచ్చు.

కంటి చూపు మెరుగు పరుచుకోవడానికి :

ద్రాక్ష పండ్లు తినడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది మరియు కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్స్ లెవెల్స్ తగ్గిస్తుంది. వీటిలో అధిక శాతం ప్రోటీన్లు ఉండడంవల్ల రెటీనా కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

బ్రెయిన్ పవర్ పెంచుకోవడానికి :

ఒక పరిశోధన ప్రకారం ద్రాక్ష పండ్లు తినడం వల్ల బ్లడ్ ఫ్లో బ్రెయిన్ కు ఎక్కువగా జరుగుతుంది. దాంతో అల్జీమర్స్ సమస్యను తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్ నుండి కాపాడుకోవడానికి :

ద్రాక్ష పళ్ళు తినడం వల్ల క్యాన్సర్ నుండి కాపాడుకోవచ్చు మరియు వీటిని తినడం వల్ల హానికరమైన యువి రేస్ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఎరుపు రంగులో ఉన్న ద్రాక్ష పండ్లు తినడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ లో జరిగే హానికరమైన రేడియేషన్ నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి మంచిది :

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఫలావోనోయిడ్స్ మరియు రెస్వెరాటల్ ఉండాలి. అయితే ద్రాక్షపండ్లు లో ఈ రెండు కాంపౌండ్స్ ఉంటాయి. దాంతో మీ శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ శాతం మరియు హైబీపీ తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news