ముఖ కవళికలు: ఈ గుర్తుంటే లక్షాధికారి అవుతారా..?

-

మనిషి ముఖ కవళికలు అతడి ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని తెలుపుతాయని నిపుణులు చెబుతున్నారు. మనిషి ముఖ భాగంలోని నుదిటి, కనుబొమ్మలు, గడ్డం, కళ్లు మొదలైన వాటి ఆకృతిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ వ్యక్తి మొక్క స్వభావం, వ్యక్తిత్వాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. దీనినే ఫేస్ రీడింగ్ అని అంటారు. అయితే చాలా మందికి ఫేస్ రీడింగ్ గురించి తెలుసు. కోపం, దుఃఖం, పొగవు ఉన్నప్పుడు మనిషి ముఖ కవళికలో మార్పులను గమనించే ఉంటారు. అయితే కొన్ని ముఖ కవళికలు, అవి తెలిపే లక్షణాల గురించి తెలుసుకుందాం.

ఫేస్ రీడింగ్
ఫేస్ రీడింగ్

నుదిటిపై స్వస్తిక్ చిహ్నం ఉన్నవారికి ఎంతో అదృష్టవంతులుగా పరిగణించబడతారు. స్వస్తిక్ చిహ్నం శుభ పరిణామంగా భావిస్తారు. ఇలాంటి వారు భవిష్యత్‌లో లక్షాధికారులు అయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ గుర్తు అందరికీ ఉండదని, వేలల్లో ఒకరికి మాత్రమే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కొందరు వ్యక్తులకు ఫోర్‌హెడ్ చాలా విశాలంగా ఉంటుంది. అలాంటి వారు ప్రభావశీలులుగా పరిగణిస్తారు. సమాజంలో వీరికి విలువ, ప్రతిష్ట, సంపద, గౌరవ మర్యాదలు ఎక్కువగా లభిస్తాయి. సమాజంలో వీరికి కమాండింగ్ ఎక్కువగా ఉంటుంది. నాయకుడిగా ఎదిగే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీరు ఏమనుకుంటే అది సాధించేవరకు కష్టపడి విజయం సాధిస్తారు.

ఫోర్‌హెడ్ చిన్నదిగా ఉన్న వ్యక్తులకు మేధో సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఏదైనా విజయం సాధించాలనుకుంటే వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎంత కష్టపడినా విజయం వరిస్తుందని చెప్పలేం. డబ్బులు, కష్టాలు వంటి సంక్షోభంలో ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అయితే ఫోర్‌హెడ్ సాధారణ పరిమాణంలో ఉన్నవారు జీవితంలో చాలా మంచిగా బతుకుతారు. బ్యాలెన్సింగ్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తారు.

ఫోర్ హెడ్‌పై నెలవంక ఆకారం ఉన్న వాళ్లు అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వీరి జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. ధనం కూడా బాగానే సంపాదిస్తారు. వ్యాపారంలో అడుగుపెడితే పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

కొంత మందికి నుదిటిపై శంఖం గుర్తు ఉంటుంది. అలాంటి వారు ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి ఉంటారు. వీరు కూడా అదృష్టవంతులుగా పరిగణించబడతారు. సమతుల్య జీవితాన్ని, ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మరికొందరి నుదిటిపై చారలు కనిపిస్తుంటారు. వీరికి కోపంతోపాటు తెలివి కూడా ఎక్కువగానే ఉంటుంది. కపటత్వం ప్రదర్శించి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారితో దూరంగా ఉంటేనే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news