రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు మనం చూస్తూనే వున్నాం. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలం లో ఫేక్ వార్తలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. అలాగే రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కి సంబందించిన వీడియోలు కూడా వస్తున్నాయి.
అయితే తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. దీనిలో వారు మిసైల్ ఫైరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిజానికి అది ఈ యుద్ధానికి సంబంధించిన వీడియో కాదు. ఇవి రెండు సందర్భాల మధ్య వీడియోలు. ఒకటి సౌత్ కొరియన్ కి సంబందించినది. మరొకటి ఆఫ్ఘనిస్తాన్ దగ్గర.
దీంతో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. పైగా ఈ వీడియోలో మొదటి భాగం 17 నిమిషాలు ఉంది. అయితే దానిలో ఉండే కొరియా ఆయుధాలు మీద కొరియన్ అక్షరాలు ఉన్నాయి. దీంతో అది రష్యా కి కానీ ఉక్రెయిన్ కి కానీ సంబందించినది కాదని కొరియా లో జరిగిన సందర్భంలోనిది అని తెలుస్తోంది.
అదే విధంగా కొరియర్ జెండా కూడా మనం వీడియోలో చూడొచ్చు. అయితే ఈ వీడియో మిస్సైల్ షూటింగ్ కాంపిటీషన్ లోనిది అని స్పష్టంగా తెలుస్తోంది. 2017లో ఈ కాంపిటీషన్లు జరిగాయి. వాటిలోనిది ఈ వీడియో అంతేకానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాదు.