కేసీఆర్ కు దమ్ముంటే నన్ను జైల్లో వేయాలి : జితేందర్ రెడ్డి

-

కేసీఆర్ కు దమ్ముంటే నన్ను జైల్లో వేయాలని మాజీ ఎంపి జితేందర్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమకారుడు మున్నూర్ రవికి ఆథిత్యం ఇవ్వడం తప్పా…? తెలంగాణ కోసం పనిచేసిన వారిని కేసిఆర్ మర్చిపోవచ్చు కానీ జితేందర్ రెడ్డి మర్చిపోరని ఫైర్ అయ్యారు. నేను అజాత శత్రువునని.. రాజకీయాల్లో మచ్చలేని నాయకున్ని…. నేను షెల్టర్ ఇయ్యలేదు….. ఆతిథ్యం ఇచ్చానని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే జుడీషియల్ ఎక్వయిరీ వేయాలి….శ్రీనివాస్ గౌడ్ ను హత్యచేయాల్సిన అవసరమేంటి ముందు అదితేల్చాలని నిలదీశారు. హత్యచేయాలనుకొన్న వారు టిఆర్ఎస్ వారే అది గుర్తించాలి…పోలీసులను బలిపశువులను చేశారు..అలాగే పోలీసులు ఓవరాక్షన్ మానుకోవాలని ఫైర్ అయ్యారు.

బిజేపి గల్లిపార్టి అనుకొంటున్నామో డిల్లీపార్టి అని మండిపడ్డారు. నాఇంటిపై టిఆర్ఎస్ వాళ్లు దాడిచేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు..ఎందుకు వాళ్ళను గుర్తించలేదు ? అని నిలదీశారు. ఇళ్ళపై దాడిచేస్తే భయపడతామా…. అమాయకులను కేసులతో భయపెడతారా? నేను పోలీసులపై హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తే ఏమౌతుందో తెలుసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news