ఫ్యాక్ట్ చెక్‌: క‌రోనా పేషెంట్ ద‌గ్గరికి వ‌స్తే ఆరోగ్య‌సేతు యాప్ సైర‌న్ మోగిస్తుందా ?

-

సోష‌ల్ మీడియాలో నిత్యం వ‌చ్చే ఫేక్ వార్త‌లు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ క‌రోనా నేప‌థ్యంలో కొంద‌రు వీటిని అదే ప‌నిగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక ఆరోగ్య‌సేతు యాప్‌పై కూడా కొంద‌రు న‌కిలీ వార్త‌ల‌ను విచ్చ‌ల‌విడిగా ప్ర‌చారం చేస్తున్నారు. ఆ యాప్ ఫోన్‌లో ఉంటే.. క‌రోనా పేషెంట్ మ‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన‌ప్పుడు.. ఆ యాప్ సైర‌న్‌ను మోగిస్తుంద‌ని.. ప్ర‌స్తుతం కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని, పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని వెల్ల‌డైంది.

క‌రోనా ఉన్న వారు మ‌న ద‌గ్గ‌రికి వ‌స్తే మ‌న ఫోన్‌లో ఉండే ఆరోగ్య సేతు యాప్ పెద్ద‌గా సైర‌న్‌ను మోగిస్తుంద‌నే వార్త‌లో ఎంత మాత్రం నిజం లేద‌ని, అది అబ‌ద్ద‌మ‌ని.. అలాంటి ఫీచ‌ర్ ఆ యాప్‌లో లేద‌ని MyGov India స్ప‌ష్టం చేసింది. ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌కూడ‌ద‌ని పేర్కొంది. ఇక ఇదే విష‌యంపై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ది సైబ‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) కూడా స్పందించింది. ఆరోగ్య సేతు యాప్ అలా సైర‌న్ మోగిస్తుంద‌నే వార్త.. ఫేక్ అని తెలియ‌జేసింది.

ప్ర‌స్తుతం కరోనా నేప‌థ్యంలో సైబ‌ర్ నేర‌గాళ్లు పెద్ద ఎత్తున ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తూ జ‌నాల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మే కాక‌.. వారి డేటా, డ‌బ్బును దోచుకునే య‌త్నం చేస్తున్నార‌ని.. క‌నుక ఇలాంటి వార్త‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని.. వాటిని న‌మ్మే ముందు ఒక్క‌సారి నిజానిజాలు వెరిఫై చేసుకోవాల‌ని CERT-In సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version