ఫ్యాక్ట్ చెక్: ఇండియా పోస్ట్ లక్కీ డ్రా ని నిర్వహిస్తోంది..? నిజం ఏమిటి..?

-

ఫేక్ వార్తల్ని మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాము. తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త కనబడుతూనే ఉంటుంది. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇదిలా ఉంటే తాజాగా ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే మరి నిజంగా అది నకిలీ వార్తా లేదంటే అందులో నిజం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక ఈ వార్త గురించి చూస్తే.. ఇండియా పోస్ట్ లక్కీ డ్రా ని నిర్వహిస్తున్నట్లు ఆ వార్తలో ఉంది.

పైగా ఆ లక్కీ విన్నర్ 20 వేల రూపాయలను గెలుచుకోవచ్చు అని అందులో రాసి ఉంది. అయితే నిజంగా ఇండియా పోస్ట్ లక్కీ డ్రా ని నిర్వహిస్తోందా అనేది చూస్తే… దీనిలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇండియా పోస్ట్ ఎలాంటి లక్కీ డ్రా ని కండక్ట్ చేయడం లేదు ఇది ఒట్టి ఫేక్ వార్త మాత్రమే అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దు నమ్మితే మీరే నష్టపోవాల్సి ఉంటుంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పై స్పందించింది. ఇది వట్టి ఫేక్ వార్త అని తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news