ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రధాని నరేంద్ర మోడీ పై విశ్వాసం మరోసారి రుజువు అయిందని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పై ఆయన తాజాగా స్పందించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోడీ పాలన సాగిస్తున్నారని వెల్లడించారు. ప్రధాని మోడీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.
అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలతాలనిచ్చాయని తెలిపారు. మరోవైపు పదేళ్ల ఆప్ పాలన చూశాక, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లు ఆలోచన చేశారని తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్ జైలుకు వెల్లాక అతని పై నెగిటివ్ ప్రచారం, నాయకత్వం లోపంతో బీజేపీకి కలిసి వచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.