మార్కెట్‌లోకి వచ్చిన నకిలీ అల్లం.. గుర్తించకపోతే ప్రమాదమే..!!

-

బయట ఏదీ కొనుక్కోని తినగలిగేటట్లులేదు..ప్రతీదాంట్లో నకిలీ దందా రాజ్యమేలుతోంది. తాగే పాల నుంచి అన్నీ కల్తీ అవతారం మెత్తాయి. ప్రాణం కంటే పైసలకు విలువ ఇచ్చే ఈరోజుల్లో మార్కెట్లో దొరికేవి తినగలిగేవే అయినా అవి నకిలీనా కాదా అనది ఒకటికి పదిసార్లు చూసుకోవాలి. వీలైనంత వరకూ మనం పండించుకునేవి అయితే మంచిది.. కానీ కూరగాయాలు, ధాన్యం అయితే మన చేతుల్లో ఉంటుంది. అంతకుమించి చాలానే వాడతాం..తాజాగా నకిలీ అల్లం కూడా మార్కెట్లోకి వస్తోంది. పొరపాటున గమనించకుండా కొంటే నష్టపోవాల్సిందే. సరిగ్గా అల్లంలా కనిపించే అటువంటి మూలికను వ్యాపారులు ఇప్పుడు ఎక్కువ లాభం కోసం మార్కెట్‌లో విక్రయించడం స్టాట్‌ చేశారు. కొంతమంది దీనిని తహద్ అని కూడా పిలుస్తారు.

అల్లం కంటే కొండ చెట్టు వేరు చాలా చౌకగా ఉంటుందని, అందుకే మార్కెట్‌లో ఎక్కువ లాభం కోసం విక్రయిస్తున్నారని తెలుస్తోంది. మార్కెట్‌లో ఎక్కువ లాభం రావడంతో ఇప్పుడు కొంత మంది సాగు చేపట్టారు. విక్రయదారుడి నుంచి ఏజెంట్ వరకు పచ్చి అల్లం అంటూ విక్రయిస్తున్నారు. మీరు మార్కెట్ నుండి అల్లం కొనుగోలు చేయబోతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉత్తమమైన, స్వదేశీ అల్లం ఉత్పత్తి అవుతుంది. స్థానిక, అత్యుత్తమ అల్లం లోపల మెష్ ఉంటుంది. అలాగే ఫైబర్స్ కూడా ఉంటాయి. ఆ అల్లం ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి ఉత్తమమైనది. అల్లం కొనుగోలు చేసేటప్పుడు అల్లం లోపల మెష్, ఫైబర్ గురించి గుర్తుంచుకోండి. కొనే సమయంలో కొద్దిగా అల్లం తీయడం వల్ల మెష్, పీచు తెలుస్తాయి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

మీరు మార్కెట్ నుంచి అల్లం కొనడానికి వెళ్ళినప్పుడు అల్లంను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. అల్లం కొనుగోలు చేసేటప్పుడు అల్లంపై పొర సన్నగా ఉండాలి. మీ గోర్లతో అల్లంపై నొక్కినట్లయితే పైపొర కత్తిరించేలా పైకి రావాలి. ఇప్పుడు దాని వాసన ఉందా లేదా అని పరీక్షించండి. సువాసన ఘాటుగా ఉంటే, అల్లం నిజమైనది. లేకపోతే అది నకిలీ అల్లమని అర్థం..

Read more RELATED
Recommended to you

Latest news