నకిలీ విత్తనాల గుట్టు రట్టు..!

నకిలీ విత్తనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే సీరియస్ అయినప్పటికీ కొందరు అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా నకిలీ విత్తనాలను అమాయకులైన రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా నేడు కండ్లకోయ వద్ద ఈకో అగ్రి సీడ్స్ గోదాంలో నకిలీ విత్తనాలు నిల్వ ఉన్నాయన్న రహస్య సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. సుమారు 31 లక్షల విలువచేసే నకిలీ పొద్దుతిరుగుడు, మక్కజొన్న, జొన్న విత్తనాలు స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని సీజ్ చేశారు. నాణ్యత ప్రమాణాలు లేని సుమారు 1829 జొన్న విత్తనాల విలువ 12 లక్షలు అలాగే పొద్దు తిరుగుడు 1210 విత్తనాల విలువ 18.76 లక్షలు స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యలకై వీరిపై 420 చీటింగ్ కేసు/ 680 కేసు నమోదు చేసి స్థానిక పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషను లో ఫిర్యాదు చేస్తానని అధికారులు తెలిపారు.