విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. గీతగోవిందం డైరెక్టర్ పరశురాం ఈ సినిమాని తెర మీదకు తీసుకు వచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు సురేష్ సంయుక్తంగా నిర్మించారు ఏప్రిల్ 5న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇక ఓటీటీ విషయానికి వచ్చేస్తే ఓటిటి హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇందుకుగాను భారీగానే చెల్లించారని కూడా తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్స్ లో విడుదలైన 45 రోజులు తర్వాత ఓటిటిలోకి రాబోతుందని తెలుస్తోంది ఒకవేళ కనుక పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతే ముందే ఓటిటిలోకి వస్తుందని తెలుస్తోంది దీని మీద అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.