గాల్లో వేలాడే కేఫ్.. భలే గమ్మత్తుగా ఉందే..!

-

ఇటీవల కాలంలో రెస్టారెంట్లు, కేఫ్ లు ఇంద్రభవనాలను తలపిస్తున్నాయి..భోజన ప్రియులను మరింత ఆకట్టుకునేందుకు ఎన్నెన్నో కొత్త వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు..రోబోట్ లతో ఫుడ్ సర్వీస్, ట్రైన్ సర్వీసు,నిన్న విమానంలో ఫుడ్ సెంటర్.. ఇలా ఇప్పుడు మరో ఫుడ్ కేఫ్ జనాలను విపరీతంగా ఆకర్షిస్తుంది..అది మాములుగా ఉండదు.. చూడటానికి అచ్చం గాలిలో వేలాడుతున్న ఒక డైమండ్ ఆకారం లో ఉంటుంది.. అందులోకి వెళ్ళిన వాళ్లంతా థ్రిల్ గా ఫీల్ ఆవుతున్నారు..అసలు ఆ కేఫ్ ప్రత్యేకతలు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

చుట్టూ పెద్ద పెద్ద పర్వతాలు… మధ్యలో లోయ… రెండు పర్వతాలను కలుపుతూ గాజు వంతెన… గాల్లో వేలాడే ఆ వంతెన మీద నడవాలంటే కాసింత ధైర్యం ఉండాలి..గాల్లో ఉండే వంతెన మీద అలా నడుచుకుంటూ వెళ్ళాలి.గాజు వంతెన మధ్యలో మూడు అంతస్తుల డైమండ్‌ కేఫే ఉంది మరి. ప్రపంచంలో వేలాడే అతి పెద్ద నిర్మాణంగా ఈ ‘డైమండ్‌ కెఫే’ గిన్నిస్‌బుక్‌ రికార్డుల్లోకి ఎక్కబోతోందట.

787 అడుగుల పొడవున్న ఈ గాజు వంతెనను ఇటీవలే ప్రారంభించారు. ఈ వింత, విలక్షణమైన నిర్మాణం టూరిజంలో ముందుండాలని ఉవ్విళ్లూరే జార్జియాలో ఉంది. రాజధాని తుబిలిసీ నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే దాష్‌బాషీ లోయల్లో ఈ అద్భుతం మనకు కనిపిస్తుంది.. వావ్.. వింటుంటే బాగుంది కదా.. అటు వెల్లినప్పుడు వెళ్ళి ఆ ఫీల్ ను ఎంజాయ్ చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news