ప్రధానమంత్రి పర్యటనలో బెలూన్లు ఎగరవేసిన ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక ప్రకటన చేశారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రత వైఫల్యం లేదని స్పష్టం చేశారు. నాలుగు కిలో మీటర్ల దూరంలో బెలూన్లు ఎగరేశారని పేర్కొన్నారు. నోటితో గాలి ఊది బెలూన్లు ఎగరేశారని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు.
బెలూన్లల్లో ఎలాంటి హైడ్రోజన్ లేదని వెల్లడించారు. సెక్యూర్టీ రిస్క్ లేనే లేదు.ఎస్పీజీ నుంచి మమ్మల్ని ఎలాంటి నివేదిక కోరలేదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బెలూన్లు ఎగరేశారు.పద్మశ్రీ, సావిత్రి, కిషోర్, రాజీవ్ రతన్ వంటి వారు ఈ సంఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు కృష్ణ జిల్లా ఎస్పీ జాషువా.