ప్రముఖ సీనియర్ నటి అందాల తార రాధా కుమార్తె కార్తీక నాయర్ కు తాజాగా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా లభించింది. ఉదయ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొన్ని సంవత్సరాలుగా ఆమె వ్యాపార కార్యకలాపాలను అభివృద్ధి చేయడంలో విశేషమైన పాత్ర పోషించారు. కొన్నేళ్లుగా అక్కడే స్థిరపడి..వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన కార్తీకాకు గోల్డెన్ వీసా అందజేశారు . దుబాయ్ లోని టూ ఫోర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యూఏఈకి చెందిన అహమ్మద్ మన్సూరి కార్తీకాకు గోల్డెన్ వీసాను అందజేశారు.
ఈ సందర్భంగా కార్తీక తన ఆనందం వ్యక్తం చేశారు. యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.. ఈ గుర్తింపు పొందడం చాలా సంతోషంగా ఉంది అని కార్తికా నాయర్ అన్నారు. ఇక కార్తీక తల్లి రాధా గురించి మనం పరిచయం అవసరం చేయాల్సిన పనిలేదు. 1980లో స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇక నటిగా సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించి గతంలో రాధాకు కూడా గోల్డెన్ వీసా ఇచ్చిన విషయం తెలిసిందే.
కేరళలోను ఉదయ సముద్ర గ్రూప్ హోటల్ రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, విద్యాసంస్థలు ఇలా ఎన్నో ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తీక స్పష్టం చేశారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె నెట్టింట షేర్ చేయడం జరిగింది.