‘రాహుల్.. టాన్ రాకుండా ఏం వాడుతున్నారు’.. జోడో యాత్రలో ఫ్యాన్ ప్రశ్న

-

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో’ యాత్ర కర్ణాటకలోని బళ్లారిలో కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు రాహుల్ గాంధీని ఫన్నీ క్వశ్చన్లు అడుగుతున్నారు. వాటికి రాహుల్ సరదాగా సమాధానమిస్తున్నారు.

జోడో యాత్రలో ఓ అభిమాని రాహుల్‌ స్కిన్‌ కేరింగ్‌ గురించి ప్రశ్నించారు. పాదయాత్రలో పాల్గొన్నా.. టానింగ్‌ రాకుండా ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. దీనికి రాహుల్‌ స్పందిస్తూ.. ‘‘నేను సన్‌స్క్రీన్‌ వాడను’’ అని సమాధానమిచ్చారు.

దీనికి ఆ అభిమాని స్పందిస్తూ.. ‘‘సన్‌స్క్రీన్‌ వాడకపోయినా మీ ముఖం మెరిసిపోతోంది’’ అని వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్‌ నవ్వుతూ ‘‘అమ్మ నాకు సన్‌స్క్రీన్‌ డబ్బా పంపింది. కానీ, నేను వాడను’’ అంటూ.. తన చేతికి ఉన్న టాన్‌ను అభిమానికి చూపించారు. దీంతో అక్కడున్న వారంతా సరదాగా నవ్వేశారు.

యాత్రలో భాగంగా నిన్న బళ్లారిలో రాహుల్‌ అక్కడే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ సీనియర్‌ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్‌ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version