నందమూరి ఫ్యామిలీపై అభిమానం.. వివాహ ఆహ్వాన పత్రికపై NTR, బాలయ్య

-

నందమూరి కుటుంబానికి కోట్ల మంది అభిమానులున్నారు. భాష, ప్రాంతీయ భేదం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ఈ ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఉన్నారు. చాలా మంది అభిమానులు నందమూరి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావిస్తూ ఉంటారు. అందుకే తమ ఇంట్లో ఏ వేడుక జరిగినా అందులో నందమూరి ఫ్యామిలీ కూడా భాగమయ్యేలా చూసుకుంటారు. ఇలాంటి ఓ అభిమానే విశాఖలో కూడా ఉన్నాడు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆయన కుమారుడు పులమరశెట్టి కోమలీ పెద్దినాయుడుకి కూడా బాలయ్య అంటే పిచ్చి అభిమానం. ఇటీవల పెద్దినాయుడికి పెళ్లి కుదిరింది. మార్చి 11న వివాహం చేసేందుకు నిశ్చయించారు.

పెళ్లి పిలుపు కోసం ముద్రించిన ఆరు పేజీల ఆహ్వాన పత్రికపై బాలయ్య, ఎన్టీఆర్‌ చిత్రాలను ముద్రించి అభిమానాన్ని చాటుకున్నారు. నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో.. అంటూ రాసుకొచ్చారు. ఆహ్వానం అందుకుంటున్న అతిథులు దాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీపై అభిమానాన్ని జీవితంలో ఎంతో కీలకమైన పెళ్లి ఘట్టంలో కూడా చూపించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version