ఫోన్ లు రికార్డ్ చేస్తూ తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్నాడుగా

తెలంగాణ లో పొలిటికల్ లీడర్లకు , పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ. ఫారీ కాద్రీ నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియా లో పెడుతూ వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంపీ అసద్ , అక్బరుద్దీన్ , బండి సంజయ్ , అర్ముర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు పలువురి నేతలకు ఫోన్లు చేసాడు. ఫోన్ రికార్డ్ చేయొద్దని ఇప్పటికే పలు సార్లు ఎంపీ అసద్ హెచ్చరించారు కూడా.

లోకల్ లీడర్లకే కాదు పీఎం ఓ కార్యలయానికే ఫోన్ చేసి పీఎం ఫై ఫారీ కాద్రీ ఫిర్యాదు కూడా చేసాడు. ఫారీ కాద్రీ ఫై నాగపూర్ లో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.