వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. గతంలో కర్ర పట్టుకుని వచ్చే వాళ్లు.. రేపు గొడ్డలితో వస్తారని టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు కాసు మహేష్ రెడ్డి. వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ నేతలు తట్టుకోలేరు… వీధి వీధిలో పరుగెత్తించి కొడతారని హెచ్చరించారు కాసు మహేష్ రెడ్డి.

రేపు రాష్ట్రం దాటి వెళ్లే పరిస్థితి వస్తుందని టిడిపి నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదని ఫైర్ అయ్యారు కాసు మహేష్ రెడ్డి. రుణమాఫీ విషయంలో పూర్తిస్థాయిలో చేస్తానని చెప్పి ఆ తర్వాత.. రైతులకు పంగనామాలు పెట్టడని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసగించాడని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు టిడిపి నేతల పని చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
గతంలో కర్ర పట్టుకుని వచ్చే వాళ్లు.. రేపు గొడ్డలితో వస్తారు: కాసు మహేష్ రెడ్డి
వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ నేతలు తట్టుకోలేరు
వీధి వీధిలో పరుగెత్తించి కొడతారు
– కాసు మహేష్ రెడ్డి pic.twitter.com/izfyawkAC3
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2025