కామంతో కొట్టుకుంటున్న కొందరు కళ్ళు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. కేవలం కామ కోరికలు తీర్చుకోవడానికి ఎంత దూరం అయినా పోతున్నారు. అమ్మ, చెల్లి, బిడ్డ..అనే వావి వరుసలు లేకుండా మృగంలా దారుణాలకు పాల్పడుతున్నారు. కడుపున పుట్టిన కన్న బిడ్డలను కూడా ఆఖరికి వదలడం లేదు. ఇటువంటి అమానుష ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో నీఛపు ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్న కూతురు అనేది కూడా మరచి పోయి, కనికరం లేకుండా బెదిరించి అత్యాచారం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
వివరాల్లొకి వెళితే..ఉత్తరప్రదేశ్ లోని బాందాలోని మార్క్ పోలీస్ స్టేషన్ లో ఓ నీఛుడు నివాసం ఉంటున్నాడు. 22 సంవత్సరాల క్రితం అతనికి పెళ్లి అయ్యింది. కూతురితో పాటు ఓ కొడుకు ఉన్నాడు. కూతురికి 18 ఏళ్ల వయసు ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి మీద ఆమె కన్నతండ్రి కన్ను వేశాడు. గత రాత్రి మద్యం మత్తులో ఆమెను కత్తితో బెదిరించి కూతురి మీద అత్యాచారం చేసి అతని కామం తీర్చుకున్నాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపేసి శవం కూడా చిక్కకుండా చేస్తానని కూతురిని బెదిరించాడు. కన్నతండ్రి అత్యాచారం చెయ్యడంతో కుమిలిపోయిన కూతురు శుక్రవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూస్తే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత జరిగిన ఘటన బయటకు వచ్చింది.అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాట తీసే పనిలో ఉన్నారు.. అతడు చేసిన పని అందరికి తెలియడంతో అతన్ని ఉరి తీయాలని నినాదాలు చేస్తున్నారు.