చైనాలో కరోనా తీవ్రత ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతుంది. వేలాది మంది ఆ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ఆ దేశంలో. దీనితో చైనా ప్రభుత్వం తమ పౌరుల ప్రాణాలు కాపాడుకోవడానికి గాను తీవ్రంగా కష్టపడుతుంది. ఈ వ్యాధి ఇప్పటికే 20 వేల మందికి పైగా సోకిన నేపధ్యంలో చైనా ప్రభుత్వం ఇక కఠిన ఆంక్షలను అమలు చేయడానికి సిద్దమైంది. వ్యాధి దెబ్బకు జనం పిట్టల మాదిరి రాలిపోతున్నారు.
ఇక మృతుల సంఖ్య 400 దాటింది. మరో 300 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ వ్యాధి తీవ్రత ఇప్పుడు మరో రెండు దేశాలకు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా చైనాలో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌కు చెందిన యాంగె చెంగ్.. వయసు 16 ఏళ్లు. అంటే తన కాళ్ళ మీద తాను బ్రతికే పరిస్థితి లేదు.
అతడు సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. ఆ బాలుడి తండ్రి కరోనా వైరస్ బారిన పడ్డాడనే అనుమానంతో స్థానిక అధికారులు అతణ్ని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నారు. దీనితో ఆ పిల్లాడికి ముద్ద పెట్టె వాడు లేకపోయాడు. దీనితో ఆకలితో ఆలమటించి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ బాలుడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను చైనా ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది.