ఫిబ్రవరి 06 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

శ్రీరామ ఫిబ్రవరి 6 – పుష్య మాసం –శనివారం.

 

మేష రాశి:శత్రువుల వల్ల ఇబ్బందులు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగతుంది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. అప్పుల బాధలు పెరిగుతాయి. ధన నష్టం జరుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఏ విషయాల్లో నైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి తీసుకోవడం మంచిది.

పరిహారాలు: శ్రీదుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

 

todays horoscope

 వృషభ రాశి:కార్యసిద్ధి పొందుతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా పేరు పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందుతారు. గృహంలో ఏదో ఒక శుభకార్యాన్ని జరుపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు  ఏర్పరచుకుంటారు.

పరిహారాలు: ఈరోజు శ్రీ భ్రమరాంబికాష్టకం పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:తీర్థయాత్రలు చేస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి కార్యసిద్ధి పొందుతారు. సోదరులతో కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు.  ప్రయాణాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. తల్లిదండ్రుల సలహాలు, సూచనలు పాటిస్తారు. విద్యార్థులు కష్టపడి బాగా చదువుకుంటారు. పోగొట్టుకున్న డబ్బుని, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యాన్ని తగించుకుంటారు.

పరిహారాలు: శ్రీకనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

కర్కాటక రాశి:ఈరోజు పై అధికారుల మెప్పు పొందుతారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా తొందరపడి మాట్లాడటం వల్ల నష్టాలు. ఇష్టమైన వారు దూరం అవుతారు.  కొత్త వ్యక్తులతో పరిచయాలుకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార భాగస్వాములుగా చేరడం వల్ల నష్టాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు పై అధికారుల మెప్పు పొందుతారు. బంగారు ఆభరణాల కొనుగోలు కు అనుకూలం కాదు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలు పొందుతారు.

పరిహారాలు: విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపాటు తనం వల్ల నష్టాలు. అప్పులు చేస్తారు. ధననష్టం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలకు వాయుడ వేసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. విలువైన వస్త్రాలు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. పెద్ద వారి మాటలను పాటించకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

పరిహారాలు: ఈరోజు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, దగ్గర్లో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి.

 

కన్యారాశి:ఆర్థిక లాభాలు పొందుతారు !

ఈరోజు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. అప్పుల బాధలు తీర్చుకొని ధన లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించి ఆర్థిక లాభాలు పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయం లాభాలను కలిగిస్తాయి.  సోదరులతో సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు.

పరిహారాలు: అన్నపూర్ణ అష్టకం పారాయణం చేసుకోండి.

 

తులారాశి:వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. తొందరపడి మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తక్కువ మాట్లాడడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టడం మంచిది.

పరిహారాలు: శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:పోటీ పరీక్షల్లో పరీక్షల్లో విజయం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో క్రొత్త పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలకు అనుకూల తీర్థయాత్రలు చేస్తారు. స్థిర నివాసాన్ని కొనుగోలు ప్రయాత్నాలు చేస్తారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. పెద్దల అంగీకారంతో ప్రేమికులు ఒకటవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందుతారు.

 పరిహారాలుః ఈరోజు శ్రీలలితా చాలీసా పారాయణం తెలుసుకోండి.

 

 ధనస్సు రాశి:ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు  అనుకూలంగా లేదు. విద్యార్థులం కష్టపడి చదువు కోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి అంతా శుభ ఫలితాలు కలుగుతాయి.

 

 మకరరాశి:నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు !

‌ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సోదరులతో కలిసి మెలిసి సఖ్యతగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. నూతన గృహాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో అందరితో కలిసి మెలిసి సఖ్యత ఉంటారు.

పరిహారాలుః ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ఈరోజు అదృష్ట యోగం !

ఈరోజు అదృష్ట యోగం ఉంది. ఏ పనులు చేసినా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులకు అందరికీ ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. లాభాలు కలిగిస్తాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

మీన రాశి:నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం !

ఈ రోజు బాగుంటుంది. నిజమైన మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలసిమెలసి సంతోషంగా ఉంటారు, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం, కొత్త వ్యాపారాలను ప్రారంభించి ఆర్థిక లాభాలు పొందుతారు. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సిన రోజు. ధన లాభం పొందుతారు. ధన కనక వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news